KRNL: పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన మండల రైతులు ఈ -కేవైసీ తప్పనిసరిగా చేసుకువాలని తహసీల్దార్ వెంకటలక్ష్మీ సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు రైతులు ఈ -కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ రాయితీలు, పథకాలు వర్తిస్తాయన్నారు. ఇప్పటికే మండలంలో 80 శాతం ఈ -కేవైసీ పూర్తి చేశామన్నారు. మిగిలిన రైతులు ఈ నెల చివరిలోపు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.