GDWL: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు రైతులకు స్లాట్ బుకింగ్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని గురువారం సమావేశంలో సూచించారు.