E.G: నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో ‘జన్మ భూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలని సీపీఏం జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 12 సంవత్సరాలుగా జన్మభూమి, కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లకు నిడదవోలు రైల్వే స్టేషన్‌కి హాల్ట్ ఇవ్వడం లేదన్నారు.