MDK: మెదక్ నియోజకవర్గ చరిత్రలో మొన్న పెన్నడు లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. రామయంపేట బస్ స్టేషన్ ఆధునీకరణ, ఏడుపాయల కమాన్ బస్సు షెల్టర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం వద్ద వరదలతో దెబ్బతిన్న నిర్మాణాలకు 1.5 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.