ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.