RR: షాద్ నగర్ పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పలు మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు మెడికల్ షాపులలో వారి వద్ద ఉన్న అనుమతులు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా 12 షాపులలో సోదాలు నిర్వహించినట్లు.. నిషేధిత మందులు, కాలం చెల్లిన మందులు స్టోర్స్ లో పెట్టారా అని పరిశీలించినట్లు తెలిపారు.