NLG: రైతులు CCI కొనుగోలు కేంద్రాలలో పత్తిని అమ్ముకొని ప్రభుత్వ ఇచ్చిన మద్దతు ధరను పొందాలని మర్రిగూడ మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్ అన్నారు. బుధవారం మండలంలోని కొట్టాలలో కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. పత్తి అమ్మేందుకు రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకొని CCI కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.