ప్రకాశం: తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పామూరు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రధానంగా పామూరు మండలంలోని పెద్ద చెరువు అలుగు, తదితర ప్రాంతాలలో నీరు నిలవడంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి జి. అరవింద రెడ్డి జెసిబి సహాయంతో శుభ్రం చేయించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.