NRPT: మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అంతకుముందు మాంచాలమ్మ ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు.