AP: కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటనలో నారాయణరావును అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సాయంత్రం నారాయణ రావును కోర్టులో హాజరుపరుస్తామని, ఈ ఘటనకు పార్టీల ప్రమేయం లేదన్నారు. ఏ పార్టీ కూడా తమ వాడని క్లెయిమ్ చేయలేదన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.