CTR: పలమనేరు బైపాస్ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూర్ ఫ్లై ఓవర్ వద్ద ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన ఓ కుటుంబం తిరువన్నామలై దైవ దర్శనం ముగించుకుని ఇంటికి బయల్దేరారు. రోడ్డుపై వర్షపు నీరు ఎక్కువగా నిలబడటంతో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.