NTR: గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీమ్ జయంతిని నిర్వహించారు. విశ్రాంత ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అమరుడైన కొమరం భీమ్ గొప్ప దేశభక్తుడని సాయిబాబా కమిటీ అధ్యక్షుడు నారాయణరావు కొనియాడారు.