ASR: అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని తుమ్మానువలస గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం, తుమ్మానువలస వైపు నుంచి వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.