BHPL: భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం (రేపు) పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రేగొండ మండల SI రాజేష్ సోమవారం తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యువత, ప్రజలు రక్తదానం చేసి మానవతా విలువలను చాటాలని కోరారు. రేగొండ నుంచి ఉదయం వాహన సౌకర్యం కల్పించామని, వివరాలకు 8712658123ను సంప్రదించాలని సూచించారు.