SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్లో సోమవారం దీపావళి పండుగ సందడి నెలకొంది. ఇక్కడి ప్రాంత దుకాణాల్లో, ఆయా ప్రధాన కూడల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి పూజా సామాగ్రి, దుకాణాల అలంకరణ వస్తువులు, రకరకాల టపాసులు విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడంతో రద్దీ నెలకొంది. టపాసుల స్టాళ్లతో, కొనుగోలుదారుల తాకిడితో దీపావళి పండుగ శోభను సంతరించుకుంది.