కృష్ణా: తాడిగడపలో ఓ కన్నతల్లి, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తి ఇద్దరు పిల్లలను హింసించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోతిర్మయి తన మొదటి భర్తతో విభేదాల కారణంగా ఇద్దరి పిల్లలతో విడిగా ఉంటూ మహేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా ఈ ఇద్దరూ పిల్లలను హింసిస్తున్నారు. చుట్టుపక్కల వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.