MDK: జిల్లా కేంద్రంలో జరిగిన మెదక్ ప్రీమియర్ లీగ్-3 పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ లీగ్లో ఐదు టీమ్లు పాల్గొనగా, రామ్స్, రియాద్ జట్లు తుది పోరుకు చేరాయి. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో, ఆటకు మరో ఐదు నిమిషాల సమయం ఉండగా రామ్స్ జట్టు గోల్ కొట్టి విజేతగా నిలిచింది. విజేతలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు బహుమతులు అందించారు.