SRPT: సమాజ సేవలో కోదాడ ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ భాగస్వామ్యం అవుతుందని సొసైటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎల్డర్స్ రిక్రియేషన్ క్లబ్లో వార్షిక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… విద్యా, వైద్యం, క్రీడా సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధికి సొసైటీ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.