AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ ప్రచురించిన భగవద్గీత పుస్తకంలో గీతా సారం లేదని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే, ఈ పుస్తక ప్రచురణకు రూ.50 కోట్లు ఖర్చు అయ్యాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచే తప్పకుంటానని ప్రకటించారు.