ELR: పోలవరం నియోజకవర్గం ప్రజానీకానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం ఒక విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పిల్లలు టపాసులు వెలిగించే సమయంలో పెద్దలు తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అగ్ని ప్రమాదాలను నివారించడానికి రక్షణ దుస్తులు ధరించి దగ్గరలో నీరు, ఇసుక ఉంచుకోవాలన్నారు.