SRD: ఖేడ్ పట్టణ మున్సిపల్ ఆఫీసులో ఇవాళ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరై స్థానిక మహిళా కార్మికులను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధులను సద్వినియోగం చేసి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.