WNP: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యామ్ లాంటి అనేక వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి నీటి పారుదుల శాఖ అధికారులను సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల గురించి అధికారులతో చర్చించారు. ఈ మేరకు చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.