WGL: వరంగల్ నగరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నేడు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే, మైనారిటీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్‌ను ఆహ్వానించకపోవడం వివాదానికి కారణమైంది. ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆహ్వానించకపోవడం శోచనీయం అన్నారు.