HYD: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ప్రతి బూత్ స్థాయిలో సమన్వయంతో పని చేయాలన్నారు. బీజేపీ పార్టీ శక్తిని మరింత బలంగా ప్రదర్శించేందుకు కృషి చేయాలని సూచించారు.