KNR: గంగాధర మండల కేంద్రంలోని మధుర నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను శనివారం సినీనటి అనసూయ భరద్వాజ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయను చూసేందుకు అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. స్థానిక వ్యాపారాల వృద్ధికి ఇలాంటి సంస్థలు తోడ్పడతాయని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.