KNR: తెలంగాణ రాజకీయ నాయకులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలని, లేకపోతే వారి బండారం బయటపెడతామని ఆయన అన్నారు. అవినీతి, మాఫియా, తీవ్రవాదంపై కేంద్రం నిఘా ఉంచిందని, ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.