W.G: డాక్టర్ పోస్టు ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో వల్లూరులోని ఆయుర్వేద వైద్యశాల నిరుపయోగంగా మారింది. గతంలో నిత్యం 50 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందే వారని గ్రామస్థులు తెలిపారు. దీంతో అందులోని విలువైన మందులు, పరికరాలు వృథాగా పడి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారిని నియమించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.