WGL: నల్లబెల్లి రైతు వేదికలో ఇవాళ జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా GP ఉప సర్పంచ్ వేణు కలెక్టర్‌ను కలిసి గ్రామంలో సుమారు 600 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని 3 సం.లు గడుస్తోందని తెలిపారు. త్వరగా స్పందించి వాటిని మంజూరు చేయాలని కోరారు.