»Tamil Nadu Theatre Owners To Stop Screening Of The Kerala Story
The Kerala Story సినిమా మాకొద్దు బాబోయ్ అంటున్న థియేటర్ యజమానులు
తమిళనాడులో ఈ సినిమాల వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ యాజమాన్యం సంఘం పేర్కొంది.
వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’పై (The Kerala Story) సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల మధ్య వైషమ్యాలు, మత కల్లోలాలు రేపేలా ఈ సినిమా రూపొందించడంతో ఈ సినిమాను ప్రజలు అడ్డుకుంటున్నారు. కేరళలో (Kerala) ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. తమిళనాడులోనూ (Tamil Nadu) అడ్డంకులు వస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో గొడవలు (Riots) జరుగుతున్నాయి. దీంతో ‘ఈ సినిమాను మేం వేయలేం’ అంటూ చెన్నైలోని (Chennai) థియేటర్ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. కేరళ స్టోరీని ప్రదర్శించలేమని ప్రకటించాయి.
కేరళ స్టోరీ సినిమా మే 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి తీవ్ర వివాదమవుతోంది. తమిళనాడులో ఈ సినిమాల (Movies) వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు (Law and Order) భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ (Theatre Owners) యాజమాన్యం సంఘం పేర్కొంది. ఈ కారణంగా సినిమా ప్రదర్శించలేమంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) ఆందోళనలు చేపట్టింది. పలుచోట్ల థియేటర్లను ధ్వంసం చేసింది.
ఈ సినిమా ప్రదర్శితమవుతున్నా ఆన్ లైన్ (Online)లో టికెట్ బుకింగ్ సదుపాయం చూపించడం లేదు. దాడులు చేస్తారని భావించి ఈ విధంగా చేశారు. అయినా కూడా దాడులు జరుగుతుండడంతో ఈ సినిమాను తీసి వేయాలని నిర్ణయించారు. ‘మల్టీప్లెక్స్ (Multiplex)ల్లో శాంతిభద్రతల సమస్య ఎదురవుతోంది. ఇతర సినిమాలు (Movies) ప్రదర్శితమవుతున్న స్క్రీన్స్ లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఒక్క సినిమా వలన ఇతర సినిమాలు కూడా చూడలేని పరిస్థితి. ఇది మా ఆదాయానికి (Income) చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే సినిమాను ప్రదర్శించలేం అని నిర్ణయించాం’ అంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.