TG: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల కోసం BRS అభ్యర్థిగా మాగంటి సునీత మూడో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆమె షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాగంటి సునీత వెంట బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి సహా కేపీ వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్కు అత్యంత కీలకం కానుంది.