పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని ఘర్షణల అనంతరం తాలిబన్లు ఉద్రిక్తతను పెంచిన విషయం తెలిసిందే. డ్యూరాండ్ లైన్ సమీపంలోని తమ పోస్టుల నుంచి పాక్ సైనికులు పారిపోయారని వెల్లడించారు. అందుకు ప్రూఫ్‌గా తాలిబన్లు పాక్ సైనికుల ప్యాంట్లను, ఆయుధాలను లాగేసుకున్నారు. ఈ ప్యాంట్లను తమ తుపాకులకు వేలాడదీసి, వీధుల్లో ఊరేగిస్తూ తాలిబన్లు విజయోత్సవాలు జరుపుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.