MNCL: జన్నారం మండలంలో ఎంపిక చేయబడిన గ్రామాలలో బోదకాలు నియంత్రణపై టాస్ సర్వే కొనసాగుతోందని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డా.ఉమాశ్రీ తెలిపారు. గురువారం గీతానగర్, తదితర గ్రామాలలో వైద్య సిబ్బంది ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దోమల కుట్టకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని వారు సూచించారు.