MHB: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, CS రామాక్రిష్ణరావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసిలో MHBD జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.