అన్నమయ్య: చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్స్‌ను ఇవాళ మదనపల్లెలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ఆవిష్కరించారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు టి. హరీంద్రనాథ్ శర్మ మాట్లాడుతూ… విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కావున 8. 9. 10 తరగతుల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.