AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం పదే పదే రాజకీయం చేస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లడ్డూ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఓ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఈ అంశంతో రెండు రకాలుగా లాభపడాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. వైసీపీని దెబ్బతీయడంతో పాటు ఆర్థికంగా లాభపడాలని ప్లాన్ చేశారన్నారు.