MHBD: డోర్నకల్ మండల కేంద్రంలోని పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు మండల పశువైద్యుడు డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. నాలుగు నెలల వయసు నుంచి పెద్ద పశువుల వరకు ఈ టీకాలు వేయడం జరుగుతోందని వివరించారు. ఇవాళ బంజర గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.