»Anand Mahindra Questioned You Didnt Believe Karma Then See This Video
Anand Mahindra కర్మ, విధిని నమ్మడం లేదా అయితే ఈ వీడియో చూడండి
వీడియో చూసిన ఆనంద్ మహేంద్ర ట్విటర్ లో పంచుకున్నారు. విధి, కర్మ అంటే ఇది అని చెప్పేలా ట్వీట్ చేశారు. ‘మీరు కర్మ లేదా విధిని నమ్మడం లేదా. ఈ వీడియోతో మీరు నమ్మేలా చేస్తుంది’ అంటూ రాసి వీడియోను షేర్ చేశారు.
ఆయన వ్యాపారవేత్త (Businessman).. వ్యాపారాలతో పాటు ప్రజలపై సాధకబాధకాలపై కూడా దృష్టి సారిస్తారు. ఏ మారుమూల ప్రతిభ (Talent) దాగున్నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఆయన నిత్యం సామాజిక మాధ్యమాల్లో (Social Media) చురుగ్గా సమాజంలో జరుగుతున్న వాటిపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని వింతలు.. విశేషాలు పంచుకుంటారు. ఆయన మహేంద్ర గ్రూపు (Mahindra Group) సంస్థల అధిపతి ఆనంద్ మహేంద్ర (Anand Mahindra). తాజాగా కర్మ, విధి గురించి ఆనంద్ మహేంద్ర ఓ ట్వీట్ చేశారు. మీరు వాటిని నమ్మడం లేదా.. ఇది చూస్తే ఒకసారి ఆలోచిస్తారు అంటూ ఓ వీడియోను ట్విటర్ (Twitter)లో పోస్టు చేశారు. ఆ ట్వీట్ వైరల్ (Viral)గా మారింది.
ఆ వీడియోలో ఓ యువకుడు రోడ్డు (Road) పక్కన ఫుట్ పాత్ (Footpath)పై నిలబడి ఉన్నాడు. దేనికోసమో వేచి చూస్తున్నా సరదాగా అక్కడ గ్రిల్ వద్ద నిల్చున్నాడు. వేచి చూస్తూ చూస్తూ అలా తిరుగుతున్నాడు. అలా గ్రిల్ పక్క నుంచి వెళ్లాడో లేదో అప్పుడే ఓ కారు దూసుకువచ్చింది. అక్కడే ఉన్న చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంతో ఆ యువకుడు ఒక్కసారిగా భయాందోళన చెందాడు. రెప్పపాటు క్షణంలో జరిగిన ఈ ప్రమాదంతో ఆ యువకుడు (Youngman) షాక్ కు గురయ్యాడు.
ఈ వీడియో చూసిన ఆనంద్ మహేంద్ర ట్విటర్ (Twitter)లో పంచుకున్నారు. విధి, కర్మ అంటే ఇది అని చెప్పేలా ట్వీట్ చేశారు. ‘మీరు కర్మ (Karma) లేదా విధిని (Destiny) నమ్మడం లేదా. ఈ వీడియోతో మీరు నమ్మేలా చేస్తుంది’ అంటూ రాసి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా ఆనంద్ మహేంద్రకు ట్విటర్ లో 10.5 మిలియన్ల మంది ఫాలోవర్లు (Followers) ఉన్నారు. ఆయన పంచుకునేవన్నీ అత్యంత అరుదైన విషయాలను పంచుకుంటుంటారు. అందుకే ట్విటర్ లో ఆయనకు యమ క్రేజీ ఉంది.