»Bjp Group Politics Bandi Sanjay Kumar Key Comments On Eatala Rajender Team
Telangana ఈటల బృందం ఏం చేస్తుందో తెలియదు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తనకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది. పార్టీలో అన్ని నాకు తెలిసి జరగాల్సిన పని లేదు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారు.
అధికారం సాధించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతుంటే స్థానిక నాయకత్వం మాత్రం వర్గ విబేధాలతో (Clashes) సతమతమవుతోంది. తెలంగాణలో (Telangana) బీజేపీ నాయకుల మధ్య ఐక్యత కొరవడింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, మాజీ మంత్రులు ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో గ్రూపుగా పార్టీ మారిపోయింది. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండానే పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్పందించారు. అన్ని నాకు తెలిసి జరగాలని లేదు కదా అని కొంత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో (Ponguleti Srinivasa Reddy) పార్టీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.
పార్టీలో చేరాలని ఆహ్వానించేందుకు పొంగులేటితో భేటీ అయ్యేందుకు పార్టీ ప్రతినిధుల బృందం గురువారం ఖమ్మం (Khammam) బయల్దేరింది. అయితే ఈ కరీంనగర్ (KarimNagar) లో ఓ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ ను మీడియా (Media) ఇదే విషయమై ప్రస్తావించింది. అయితే దీనిపై తనకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది. ‘పార్టీలో అన్ని నాకు తెలిసి జరగాల్సిన పని లేదు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. అన్ని నేనొక్కడినే చేయాలని భావించడం సరికాదు’ అని బండి సంజయ్ తెలిపారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధ్యక్షుడికి (President) తెలియకుండానే పార్టీ వ్యవహారాలు జరుగుతాయా? అని మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. ఖమ్మం జిల్లా (Khammam District) రాజకీయాలు మార్చే కీలక నాయకుడు చేరిక విషయం తనకు తెలియదు అని చెప్పడం చూస్తుంటే పార్టీలో అసలు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారా? అనే ప్రశ్న మొదలతుందని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. పార్టీలో సంజయ్ కు ప్రాధాన్యం లేదని.. అసలు ఆయనకు ఎవరూ గౌరవించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయం వరకు సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు లేవని చర్చలు జరుగుతున్నాయి.