GDWL: ఎంపీ డా. మల్లు రవిని జోగులాంబ గద్వాల్ జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్ రావు సోమవారం కలిశారు. ఈ మేరకు జిల్లాలోని పలు సమస్యలను వారికి వివరించారు. ప్రధానంగా ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయాలను కేంద్ర ప్రభుత్వం యునెస్కో గుర్తింపు తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గద్వాల్‌లోని పూడూరు ప్రాంతాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని కోరారు.