GDWL: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అయిజ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు, సోమవారం పట్టణంలోని గాజులపేట కాలనీలో సివిల్ సప్లై అధికారులతో కలిసి దాడి చేశారు. బొలెరో వాహనంలో లోడ్ చేసిన సుమారు 77 క్వింటాళ్ల బియ్యాన్ని పటుకున్నారు.