»After Paytm And Phonepe Goes Live With Upi Lite All You Need To Know
PhonePe: ఫోన్ పే తో చెల్లింపులు.. పిన్ అవసరం లేదు..!
PhonePe కొత్తగా UPI లైట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది PINని నమోదు చేయకుండా UPI లైట్ ఖాతా నుంచి ఒక్కసారి నొక్కడం ద్వారా రూ.200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను చేయడంలో సహాయపడుతుంది. పరికరంలోని ఖాతా బ్యాలెన్స్ నుంచి ఆ మొత్తం నేరుగా డెబిట్ చేయబడుతుంది. దీంతోపాటు ఈ ఫీచర్ వేగవంతంగా పూర్తవుతుంది.
ఈరోజుల్లో ఫోన్ పే(PhonePe) వాడనివారు ఎవరూ ఉండరేమో. స్మార్ట్ ఫోన్ ఉన్న అందరి దగ్గరా ఫోన్ పే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు డిజటలైజ్ చేసిన తర్వాత వీటి వాడటకం బాగా పెరిగిపోయింది. కాగా, తాజాగా ఫోన్ పే తమ ఖాతాదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించినట్లు చెప్పింది. యూపీఐ లైట్(UPI Lite) పేరిట కొత్త ఫీచర్ తీసుకువచ్చింది.
దీంట్లో పిన్ ప్రవేశపెట్టకుండానే ఒకే ట్యాప్ ద్వారా రూ.200 కన్నా తక్కువ విలువ కలిగిన చెల్లింపులు చేయవచ్చని ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. యుపిఐ లైట్ అన్ని ప్రధాన బ్యాంక్‌లకు మద్దతును ఇస్తుందని, అన్ని యుపిఐ మర్చంట్లు, క్యూఆర్లలోనూ అంగీకరించబడుతుందని తెలిపింది.
ఈ ఫీచర్ అత్యంత రద్దీ వేళల్లో కిరాణా సరకులు, ప్రయాణాలు లాంటి తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు మరింత వేగవంతమైన తక్షణ పేమెంట్ పరిష్కారాలకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.
వినియోగదారులు వారి లైట్ ఖాతాలో రూ.2,000 వరకు లోడ్ చేసుకుని, ఒకే ప్రయత్నంలో రూ.200 లేదా అంతకన్నా తక్కువ మొత్తం వరకు లావాదేవీలు జరపవచ్చని ఫోన్ పే కో-ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి పేర్కొన్నారు. ఫోన్ పే యాప్ తెరిచి.. యాప్ హోమ్ స్క్రీన్‌లో యుపిఐ లైట్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.