నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలోని మొవెలో 1918 జూలై 18న జన్మించారు. మండేలా నల్లజాతి వ్యతిరేకతపై అలుపెరుగని పోరాటం చేశారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాడారు. 1962లో అరెస్టైన ఆయన 1990 వరకు జైలులోనే మగ్గిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. అనంతరం 1994లో దక్షిణాఫ్రికా దేశం స్వాతంత్య్రం పొందింది.