AP: నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు రూపొందించిన ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్కాన్ చేస్తే మద్యం సీసాకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయని తెలిపారు. ‘ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. మరోచోట అమ్మేందుకు వీల్లేదు. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు’ అని వెల్లడించారు.