NRML: రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.