శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం చతుర్దశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి గురువారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కొంత ఆలస్యంగా ఉంటుంది. స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక శుభవార్త వింటారు. ఆ వార్త మనోధైర్యాన్ని నింపుతుంది. దుర్గా స్తుతి చేయాలి.
వృషభం:శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కీలకమైన విషయాల్లో విజయాలు పొందుతారు. గత తప్పిదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. గో సేవ చేయాలి.
మిథునం: కుటుంబంలో ఆనందాలు నిండుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడిని పూజిస్తే శుభాలు జరుగుతాయి.
కర్కాటకం: వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. మీ ధర్మం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా శుభమే.
సింహం: కుటుంబంలో పరిస్థితులు సంతోషంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలి.
కన్య: బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. అష్ట లక్ష్మి స్తుతి చేయాలి.
తుల: వృథా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. దుర్గాదేవి నామస్మరణ చేయాలి.
వృశ్చికం: మానసిక ఆందోళనకు లోనవుతారు. కుటుంబ విషయాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. వృథా ప్రయణాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ స్తోత్రం చదవాలి.
ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. అద్భుత అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక పరిస్థితిలో నిలకడ ఉంటుంది. ఇతరుల సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. శనీశ్వరుడి శ్లోకం పఠించాలి.
మకరం:ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి లోనవుతారు. ఆకస్మిక ధన వ్యయం కలుగుతుంది. బంధుమిత్రులతో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి. లక్ష్మీ ధ్యానం చేయాలి.
కుంభం:ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకుంటారు. ప్రయాణాలతో లాభం చేకూరుతుంది. చేపట్టే కార్యాలు ఆటంకాలు కలుగుతాయి. కొత్త పనులు మాత్రం వాయిదా వేసుకోవాల్సిందే. బాధ్యతలు పెరుగుతాయి. లింగాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.
మీనం: బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలుచేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్వధర్మ కాపాడుతుంది. సూర్య అష్టకం పఠించాలి.