AP: వైసీపీ ప్రభుత్వం నుంచి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఒక వైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి మరీ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. ఇంత చేస్తున్నా కొందరు బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటామా? అంటూ హెచ్చరించారు. నేరస్థులు ఏ ముసుగులో వచ్చినా కట్టడి చేసి తీరుతామన్నారు.