GDWL: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇవాళ మల్దకల్లో భారీ పద సంచలన్ (ర్యాలీ) కార్యక్రమం దేశభక్తిని చాటింది. తిమ్మప్ప స్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ రూట్ మార్చ్ దశమికట్ట పాత బస్టాండ్ మీదుగా ఎస్ఎల్వీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 310 మంది RSS స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.