WGL: వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట UHCలో నిర్వహించిన పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్‌కు కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు. 0-5 సం.ల పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పోలియో కేసులు గుర్తిస్తున్నారని, దేశ వ్యాప్తంగా 290 జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.