AP: శవరాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. తప్పు చేస్తే తన, మన అనే భేదం చూడమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు పన్నితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. నిందితులకు సహకరించే అధికారులనూ ఉపేక్షించేది లేదన్నారు.