VZM: బొబ్బిలిలోని స్థానిక మల్లమ్మపేటలో ఇవాళ ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు CIలు, ఏడుగురు SIలతో సహా 51మంది పోలీసులు ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అలాగే అనుమతి పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం CI నారాయణరావు మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు నివారణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.